దళిత హక్కుల కోసం యువత ఉద్యమించాలి
- శంకర్పల్లి సాయి కాలనీ యువ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఆగమన్ - September 10, 2026
- శంకర్పల్లిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు - September 10, 2026
- రంగారెడ్డి కబడ్డీ జట్ల ఎంపిక - September 10, 2026

బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన భారత రాజ్యాంగాన్ని చదువుకున్న దళిత యువత అవగాహన చేసుకుని, గ్రామాలు, కాలనీల్లోని దళితులను చైతన్యవంతులను చేసి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని దళిత మేధా శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు బోట్ల పవన్, నాయకుడు కోడెపాక రవి పిలుపునిచ్చారు. ఎలాంటి వివక్ష లేని నవసమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. చదువుకున్న దళిత యువతను రాజకీయ నాయకులు, విద్యావేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం ముచ్చింపుల గ్రామంలో దళిత మేధా శక్తి గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ గౌరవ అధ్యక్షుడిగా పసుల రవీందర్, అధ్యక్షుడిగా బోట్ల పణిందర్, ప్రధాన కార్యదర్శిగా పసుల సాయి కుమార్, అధికార ప్రతినిధిగా తప్పట్ల పవన్ కళ్యాణ్, కమిటీ సభ్యులుగా ఇనుగాల ఉదయ్, మేకల రాహుల్ ఎన్నికయ్యారు.
సమావేశంలో దళిత మేధా శక్తి ఆవిర్భావ సభ్యులు, రాష్ట్ర నాయకులు అడ్డ రాజు, పెంబర్తి శ్రీనివాస్, మండల నాయకులు పసుల సాంబయ్య, బోట్ల సాంబయ్య, బోట్ల నరేష్, బోట్ల రవి, బోట్ల దయాకర్, కొయ్యడ కుమారస్వామి, కొయ్యడ శ్రీకాంత్, ఇనుగాల రవి, నల్లబెల్లి మేఘం, బీసీ సీనియర్ నాయకుడు కక్కెర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
