రంగారెడ్డి జిల్లా కబడ్డీ జట్ల ఎంపికకు రంగం సిద్ధం
- శంకర్పల్లి సాయి కాలనీ యువ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఆగమన్ - September 10, 2026
- శంకర్‌పల్లిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు - September 10, 2026
- రంగారెడ్డి కబడ్డీ జట్ల ఎంపిక - September 10, 2026

- జూనియర్ బాలురు, సబ్‌జూనియర్ బాలికలకు 11, 12న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఎంపిక పోటీలు
జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, సబ్‌జూనియర్ బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 11వ తేదీ శుక్రవారం, 12వ తేదీ శనివారం సాయంత్రం 3 గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు ఎం. రవికుమార్, ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్ రెడ్డి తెలిపారు.
ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగే అంతర్‌జిల్లా కబడ్డీ పోటీల్లో రంగారెడ్డి జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు.
అర్హతలు: జూనియర్ బాలురు 75 కిలోల లోపు బరువుతో, 05-11-2006 తర్వాత జన్మించిన వారు అర్హులు. సబ్‌జూనియర్ బాలికలు 55 కిలోల లోపు బరువుతో, 13-12-2010 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా 10వ తరగతి మెమో తీసుకురావాలని సూచించారు.
మరిన్ని వివరాలకు జె. చంద్రమోహన్ (7661992581), ఈ. రాజు (9000038272)ను సంప్రదించాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్ రెడ్డి కోరారు.
