రంగారెడ్డి కబడ్డీ జట్ల ఎంపిక
- శంకర్పల్లి సాయి కాలనీ యువ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఆగమన్ - September 10, 2026
- శంకర్‌పల్లిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు - September 10, 2026
- రంగారెడ్డి కబడ్డీ జట్ల ఎంపిక - September 10, 2026

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, సబ్‌జూనియర్ బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 11, 12 తేదీల్లో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు ఎం. రవికుమార్, ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 26 నుంచి 29 వరకు వేములవాడలో జరిగే అంతర్‌జిల్లా పోటీల్లో రంగారెడ్డి జిల్లా తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు.
జూనియర్ బాలురకు 75 కిలోల లోపు బరువు, 2006 నవంబర్ 5 తర్వాత జన్మించిన వారు, సబ్‌జూనియర్ బాలికలకు 55 కిలోల లోపు బరువు, 2010 డిసెంబర్ 13 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు లేదా పదో తరగతి మెమో వెంట తీసుకురావాలని సూచించారు. వివరాలకు జె. చంద్రమోహన్ (7661992581), ఈ. రాజు (9000038272)ను సంప్రదించాలని కోరారు.
