స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ దన్సింగ్ నాయక్

వెల్దండ సెప్టెంబర్ : వెల్దండ మండలంలోని చెదురుపల్లి గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ ధన్ సింగ్ నాయక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా చూస్తామని అన్నారు.స్మార్ట్ కార్డుల ద్వారా పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెరుగు సహదేవ్, వార్డు సభ్యులు శివ యాదవ్, తిరుపతి, కొమ్ము అంజయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

You may also like...