చందిప్పలో దొంగల బీభత్సం.. వృద్ధురాలిపై కత్తుల దాడి
- శంకర్పల్లి సాయి కాలనీ యువ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఆగమన్ - September 10, 2026
- శంకర్పల్లిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు - September 10, 2026
- రంగారెడ్డి కబడ్డీ జట్ల ఎంపిక - September 10, 2026

శంకర్పల్లి, సెప్టెంబర్ 10: చందిప్పలో అర్ధరాత్రి నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించారు. వారిని గమనించి అడ్డుకున్న వృద్ధురాలిపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో ముఖం, మెడ భాగాల్లో తీవ్ర గాయాలైన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై శంకర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళన నెలకొంది
