వెల్దండ శివుని గుట్ట గుండంలో విరబూసిన తామరలు

వెల్దండ సెప్టెంబర్ 07 : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని శివుని గుట్ట గుండంలో తెల్ల కలువ పుష్పాలు విరబూశాయి.ఆదివారం ఉదయం గుండంలో మూడు పువ్వులు వికసించడం భక్తులు ఆనందంతో వీక్షించారు.శివుడికి తెల్ల తామరలు అత్యంత ప్రీతికరమని అర్చకులు తెలిపారు.ఒకేసారి మూడు పువ్వులు పూయడం శుభ సూచకమని భక్తులు భావిస్తున్నారు. వీక్షించి ఫోటోలు తీసేందుకు భక్తులు గుండం వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం కోసం గుండం చుట్టూ ప్రహరీని నిర్మించి, మెట్లు ఏర్పాటుచేసి, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు భక్తులు కోరుతున్నారు.

You may also like...