ప్రజా ప్రభుత్వం కాదు ” దగా ప్రభుత్వం”

Source :యు.వంశీ, శంకర్ పల్లి:628-110-9673:

శంకర్ పల్లి మండల కేంద్రంలోనీ ఇంద్రారెడ్డి ప్రధాన చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున మహిళలతో కలిసి శంకర్ పల్లి మండల బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు గండిచర్ల గోవర్దన్ రెడ్డి మరియు మున్సిపల్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు (సొసైటీ చైర్మన్) బద్దం శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల విఫల పాలనపై పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అనంతరం ఇంద్రారెడ్డి ప్రధాన చౌరస్తా వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శంకర్ పల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు గండిచర్ల గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ…గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 200 పింఛను నుండి 2000 రూపాలకు పెంచిన ఘనత బీ.ఆర్.ఎస్ పార్టీ కేసీఆర్ గారిది అని గుర్తు చేశారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2000 రూ. పింఛన్ 4000 కి పెంచుతామని అబద్ధపు అమలు కానీ హామీలు ఇవ్వడం సిగ్గు చేటు అని ఆయన ఎద్దేవ చేశారు.

మండల బి.ఆర్.ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు (సొసైటీ చైర్మన్) బద్దం శశిధర్ రెడ్డి మాట్లాడుతూ…ముఖ్యంగా మహిళలు, వికలాంగుల సమస్యలను అజెండాగా చేసుకుని హామీల అమలుపై నిలదీసారు.ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, ముఖ్యంగా మహిళలకు నెలకు ₹2,500 ఇచ్చే మహాలక్ష్మి పథకం, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటర్లు మరియు ₹500 లకే వంట గ్యాస్ సిలిండర్ వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, కేసీఆర్ కిట్లను నిలిపివేయడం, బతుకమ్మ చీరల పంపిణీ ఆపేయడం ద్వారా చేనేత కార్మికుల పొట్ట గొట్టారని, ఇది ప్రజా ప్రభుత్వం కాదు, “దగా ప్రభుత్వం” అని విమర్శించారు.

బీ.ఆర్.ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ ధర్మాన్న గారి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ….కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల స్వర్గం.. వెయ్యి రోజుల నరకం”ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. వెయ్యి రోజులు దాటినా ఒక్క ప్రధాన హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని ఎంపీపీ ధర్మాన్న గారి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. వంద రోజుల్లో స్వర్గం చూపిస్తామని చెప్పి, వెయ్యి రోజులుగా ప్రజలకు నరకం చూపించారు అని ఆయన ధ్వజం ఎత్తారు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు విషయం లో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేరలేదని, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. అభివృద్ధి శూన్యం, అప్పుల భారం వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ. 4.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని, కానీ రాష్ట్రంలో ఎలాంటి కొత్త మౌలిక సదుపాయాలు లేదా ప్రాజెక్టులు నిర్మించలేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిబ్బన్లు కట్ చేస్తూ కాలం గడుపుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఎంతో కష్టపడి నిర్మించిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెడితే.. శాంతిభద్రతల క్షీణత, విద్యా వ్యవస్థ (గురుకులాలు) బలహీనపడటం, హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చడం వంటి చర్యలతో వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి. మున్సిపల్ అద్యక్షులు శశిధర్ రేడ్డి ,మాజీ ఎంపీపీ లు గోవర్ధన్ రెడ్డి. నర్సింలు , బిఆర్ఎస్ సినియర్ నాయకులు వాసుదేవ్ కన్నా , మాజి మార్కెట్ కమిటి చేర్మేన్ మాణిక్ రేడ్డి , సర్పంచ్ లు రాఘవేందర్ రేడ్డి , ఇంద్రాసేనా రెడ్డి, మధోల్ల మల్లికార్జున్,ఎరుకల శేకర్ , కౌన్సిలర్ లు విజయ్ కుమార్ , మహేందర్ రేడ్డి , ప్రశాంత్ , మాజి కౌన్సిలర్ లు శ్రీనాథ్ , మాజి సర్పంచ్ లు శ్రీధర్ , నర్సింహ రేడ్డి, శ్రీనివాస్ రేడ్డి , బద్దం సురేందర్ రేడ్డి , అడ్వకేట్ ఉపేందర్ రేడ్డి , వేణు,బి ఆర్ ఎస్ పార్టి సినియర్ నాయకులు, యుత్ నాయకులు , మైనారిటీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

You may also like...