మంత్రి పొన్నం ఇంట బోనాలకు సీఎం హాజరు
- హైదరాబాద్లో భారీ వర్షం.. - August 2, 2026
- ప్రజల విశ్వాసానికి నిలువెత్తు చిరునామా…సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.. - August 2, 2026
- 10 కోట్ల మాదకద్రవ్య రహిత భారత్ అభియాన్’కు శ్రీకారం - August 2, 2026

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. వేడుకల్లో పాల్గొన్న భక్తులను పలకరించిన ముఖ్యమంత్రి, బోనాల పండుగను ఘనంగా నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. సంప్రదాయ బోనాల శోభతో మంత్రి నివాసం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది.


