Daily Archive: October 1, 2026
వెల్దండ :వెల్దండ మండల పరిధిలోని రాచూరు గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సమకూర్చిన రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.అలాగే మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ రూ.2 వేలు, మాజీ ఎంపీటీసీ గుత్తి వెంకటయ్య రూ.2 వేలు, బీఆర్ఎస్ నాయకుడు…
జ్ఞాన తెలంగాణ, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందుతున్నాయి. అక్టోబర్ నెలకు ప్రభుత్వం రూ.2,692.34 కోట్లను విడుదల చేసింది. అధికారిక ఎన్టీఆర్ భరోసా డ్యాష్‌బోర్డ్‌లో...
జ్ఞాన తెలంగాణ, అక్టోబర్ 1: గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 43.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకోవడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది....
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్, అక్టోబర్ 1: పండగల సీజన్ ప్రారంభమైన వేళ వాణిజ్య రంగంపై ఎల్‌పీజీ ధరల పెంపు అదనపు భారాన్ని మోపింది. అక్టోబర్ 1 నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్‌పై...
జ్ఞాన తెలంగాణ, : భవిష్యత్తులో యుద్ధాల స్వరూపం ఎలా మారనుంది? కృత్రిమ మేధ, డ్రోన్లు, రోబోటిక్స్, స్వయంప్రతిపత్తి ఆయుధ వ్యవస్థలు, అంతరిక్ష సాంకేతికతల్లో ఎలాంటి మార్పులు అవసరం? ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించేందుకు అమెరికా రక్షణ శాఖ **‘ప్రాజెక్ట్ మెరిడియన్’**కు శ్రీకారం చుట్టింది. రక్షణ మంత్రి పీట్...
జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ యలమోని సుదర్శన్ రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 22ఏ జాబితాలోని భూముల అంశం కీలకంగా చర్చకు రానుంది. సెక్షన్ 22ఏ కింద...
జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యురో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేయనున్న డెయిరీ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ ప్రాజెక్టును సబర్ డెయిరీతో అనుసంధానించినట్లు సమాచారం. తూప్రాన్‌లోని...
వెల్దండ: ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించి, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. అక్టోబర్ 11న నిర్వహించనున్న ‘చలో వెల్దండ’ ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్–టీఎస్ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి రామాంజనేయులు మాదిగ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని మండల, తాలూకా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షుడు కేదాస్ మోహన్ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.డాక్టర్ అంబేద్కర్…
జనగామ ఆర్టీసీ బస్టాండ్ కేంద్రంగా బహుజన వర్కర్స్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర చైర్మన్ సీహెచ్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ సాజిద్, టీఆర్పీ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ మాచర్ల బిక్షపతి, జిల్లా అధ్యక్షుడు కట్ల సదానందం ముదిరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ, శ్రమదోపిడీకి…