శంకర్ పల్లి లో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా శంకర్పల్లి చౌరస్తాలోని ఆయన విగ్రహానికి శంకర్పల్లి మున్సిపల్, మండల కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రజల కోసం చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్ఆర్ చేసిన కృషిని నాయకులు కొనియాడారు. ప్రజా సమస్యలను తెలుసుకుని సంక్షేమ పథకాల ద్వారా సామాన్యులకు అండగా నిలిచిన ప్రజానాయకుడిగా వైఎస్ఆర్ ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేస్తాయని తెలిపార
ఈ కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పీఏసీఎస్ డైరెక్టర్, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
