కంటోన్మెంట్లోనే తుపాకులు ఎత్తుకెళ్లారు.
- కేఎస్ రత్నంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నేత బండమీది వెంకటేష్ - September 2, 2026
- కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన - September 2, 2026
- కంటోన్మెంట్లోనే తుపాకులు ఎత్తుకెళ్లారు. - September 2, 2026

కంటోన్మెంట్లో మిలిటరీ స్థావరంలోకి చొరబడి దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లే పరిస్థితి రావడం రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మిలిటరీ స్థావరానికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల భద్రతకు ప్రభుత్వం ఏం హామీ ఇస్తుందని ప్రశ్నించారు. ఇంతకంటే హీనమైన ప్రభుత్వం, ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి మరొకటి ఉండదని ఘాటుగా విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో నేరగాళ్లకు భయం లేకుండా పోయిందని, పాలకుల అసమర్థతకు ఈ ఘటన పరాకాష్టగా నిలిచిందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
