ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025
ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం
జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి:

హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో బుధవారం రోజున అర్ధరాత్రి ఎస్ఎఫ్ఐ నాయకుల పైన జరిగిన ఏబీవీపీ మతోన్మాద గుండాలు చేసిన దాడిని ఖండిస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
అని ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ అన్నారు . ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ కూటమి విద్యార్థి సంఘం ఎన్నికల్లో విజయం సాధించింది అన్నారు అది తట్టుకోలేక ఏబీవీపీ మతోన్మాద గుండాలు ప్రతిరోజు ఏదో ఒక దాడికి ఎస్ఎఫ్ఐ నాయకుల పైన పాల్పడుతున్నారన్నారు ఎదురుగా నిలబడే దమ్ము లేక అక్రమంగా విద్యార్థి విద్యార్థి సంఘ నాయకుల పైన దాడులు చేస్తూ యూనివర్సిటీలో ఒక గుండ రాజకీయాలను చేస్తున్నారన్నారు ఈ దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది అన్నారు
, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల విద్యార్థి నాయకుల పైన దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దమ్ములేని మతోన్మాద సంఘం విద్యార్థుల పైన దాడి చేయడం హేయమైన చర్య అన్నారు మీకు దమ్ముంటే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు మీ బలం ఏంటిదో మొన్న జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో తెలిసిందన్నారు ఈ దాడికి పాల్పడిన వారి పైన రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ అధికారులు చట్టబరమైన చర్యలు తీసుకోవాలన్నారు లేదంటే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు,శ్రీకాంత్, కార్తీక్, అనిల్ ,సందీప్ , కుమార్ , తదితరులు పాల్గొన్నారు
