ఉపాధ్యాయులు సమాజానికి దిశా నిర్దేశం చేసే వ్యక్తులుగా ఎదగాలి : మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్
- కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించాలి : బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మదుసూధన్ రెడ్డి - November 2, 2026
- కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం - November 2, 2026
- బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలుగా మహేశ్వరి - November 2, 2026
ఉపాధ్యాయులు సమాజానికి దిశా నిర్దేశం చేసే వ్యక్తులుగా ఎదగాలి : మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్
ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి: మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్ లో టీఎస్ యూటీఎఫ్ 7వ జిల్లా మహాసభలు ప్రారంభం
కట్టంగూర్, నవంబర్ 1: ఉపాధ్యాయులు కేవలం విద్యార్థులకు పాఠ్యాంశాలనే బోధించే వారిగా కాకుండా సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యక్తులుగా ఎదగాలని మాజీ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ నాగేశ్వర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎన్ యూటీఎఫ్) 7వ జిల్లా మహాసభలు అదివారం కట్టంగూర్ లోని బీఎన్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ తరగతి గదికి, సమాజానికి మధ్య ఉపాధ్యాయుడు వారధిగా ఉండాలన్నారు. దేశ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అభివృద్ధి ఫలాలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు పెరుగుతున్నా యువతలో నిరుద్యోగం, నిరాశ ఎందుకు పెరుగుతన్నాయో పాలకులు ఆలోసించాలని సూచించారు. 1950 నుంచి 1970 వరకు మధ్య దేశ జడీపీ వృద్ధి రేటు సగటున 3.4 శాతంగా ఉండగా ప్రస్తుతం 7.8 శాతానికి పెరిగినా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యావ్యవస్థ దెబ్బతింటోందని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులతో పాటు బస్సు సౌకర్యం కల్పిస్తే విద్యార్థుల నమోదు పెరుగుందని సూచించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, జీఓ 25 ప్రభుత్వ పాఠశాలల మనుగడకు ఇబ్బందిగా మారిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ఉపాధ్యాయుల కృషి చేయాలని సూచించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. అనంతరం యూటీఎఫ్ మేళాను ప్రారంభించారు. టఫ్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ పెండింగ్ డీఏలు, రెండో పీఆర్సీ వెంటనే ప్రకటించి రిటెర్మెంట్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడంతో పాటు కార్పోరేట్ అసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాసవారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిరెడ్డి రాజశేఖరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పెరుమాళ్ల వెంకటేశం, ఎన్.సోమయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా అడిట్ కమిటీ కన్వీనర్ మిట్టపల్లి ముళరయ్య, కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు బడుగు అరుణ, నర్రా శేఖర్ రెడ్డి , జిల్లా కోశాధికారి ఏ. రాజు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి సరళ, హెచ్ఎంల సంఘం జిల్లా అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ, రాష్ట్ర జిల్లా, మండల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

