కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించాలి : బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మదుసూధన్ రెడ్డి

కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించాలి : బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మదుసూధన్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 31 : ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా లో కట్టంగూర్ కు చోటు కల్పింకపోవడం బాధాకరమని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూధన్ రెడ్డి అన్నారు. కట్టంగూర్ నం కరువు మండలంగా ప్రకటించాలని శనివారం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టంగూర్ మండలంలో వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతినడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి కట్టంగూర్ను కరువు మండలంగా ప్రకటించాలని రైతులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షులు నీలం నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నకిరేకంటి మొగిలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, జిల్లా కార్యదర్శులు పబ్బు వెంకన్న, శివ, బిజెపి సీనియర్ నాయకులు గోలి ప్రభాకర్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పాదూరి వెంకట్ రెడ్డి , ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి కోమటి నర్సింహ్మ, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పులకరం శంకర్, నాయకులు కోమటి భాస్కర్, గున్నాల నాగరాజు, బొడ్డుపల్లి అంజిబాబు, వార్డు సభ్యులు శ్రీరామ సంధ్య, కోమటి నర్సింహ్మ, గోలి మహేశ్వరీ, చెరుకు నాగరాజు, బత్తిన నాగరాజు, కారంపూడి సాయి, ఓరుగంటి హరిబాబు, జలేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.

You may also like...