కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

జ్ఞాన తెలంగాణ, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బల్మూరు ప్రాంతానికి చెందిన సైదులు (23) అనే యువకుడు వ్యవసాయ పొలం సమీపంలో ఉరేసుకొని మృతి చెందాడు. కుటుంబ కలహాలే అతడి ఆత్మహత్యకు కారణమని సమాచారం. యువకుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like...