వివాహేతర సంబంధం.. భార్య హత్య
- కృష్ణా బోర్డు సమావేశం వాయిదా - October 25, 2026
- కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య - October 25, 2026
- వివాహేతర సంబంధం.. భార్య హత్య - October 25, 2026

జ్ఞాన తెలంగాణ, వరంగల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో ఓ భర్త తన భార్యను హత్య చేసిన దారుణ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. పర్వతగిరి మండలం గడ్డపారతండా శివారు హర్జతండాలో ఈ ఘటన జరిగింది. భార్య పూలమ్మను ఉరివేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త బాలు ఘటన అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. పెద్ద కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
