తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఔదార్యం

వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామానికి చెందిన మల్లోజు మంజుల ఇంటి నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి అండగా ఉంటానని, ఇంటి నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు భవిష్యత్తులోనూ అందిస్తానని హామీ ఇచ్చారు.1001384724.jpg

ఈ కార్యక్రమంలో వెల్దండ మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, నాయకులు బుచ్చిబాబు, గూళ్ల వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...