జాతీయస్థాయి తంగ్‌-తా పోటీలకు కేజీబీవీ విద్యార్థిని.. సింధు

వెల్లడం 1001291382.jpg

అక్టోబర్ 22: వెల్దండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థిని వద్యావత్ సింధు జాతీయస్థాయి తంగ్‌-తా మార్షల్ ఆర్ట్స్ పోటీలకు ఎంపికైంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో అండర్‌-17 బాలికల 48 కిలోల విభాగంలో ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించింది.ఈ నెల 30న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున సింధు ప్రాతినిధ్యం వహించనుంది.ఆమె ఎంపికపై మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బిట్టి చంద్రశేఖర్,పాఠశాల ఉపాధ్యాయులు,పీఈటీ మమత,తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.

You may also like...