రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి నియోజకవర్గం, భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడంతో గ్రామస్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారు మంత్రి గారి దృష్టికి తీసుకురావటంతో బస్సును మంజూరు చేసి, ఈరోజు ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో మహిళలు, విద్యార్థులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం పునరుద్ధరణతో గ్రామ ప్రజలకు రవాణా ఇబ్బందులు తగ్గనున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ఈ బస్సు సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ లింగారెడ్డి, సొసైటీ చైర్మన్లు భీంరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సర్పంచ్ రేఖ సుదర్శన్, మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు మహిపాల్, ఆర్టీసీ అధికారులు, గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిప్పాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం పునరుద్ధరించడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఈ సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
