సద్దుల బతుకమ్మ వేళ విషాదం.. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
- సోమవారం ప్రజావాణి రద్దు - October 18, 2026
- సద్దుల బతుకమ్మ వేళ విషాదం.. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి - October 18, 2026
- జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి - October 11, 2026

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి చిత్తలూరి మధు (అంజయ్య కుమారుడు) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మృతదేహాన్ని సందర్శించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
