వెల్దండ మండల వ్యాప్తంగా వెల్లువిరిసిన గణపతి పూజా కార్యక్రమాలు

వెల్దండ :వెల్దండ మండల వ్యాప్తంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి సర్పంచ్ ముట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీను ముదిరాజ్, డిసిసి ఉపాధ్యక్షులు ఎన్నం భూపతిరెడ్డి దంపతులు, రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి,మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాలలో కూడా సర్పంచులు సత్తూరి ప్రసాద్ గౌడ్, శ్రీనివాసులు,సంగీత శేఖర్ రెడ్డి, ధన్ సింగ్, రమేష్ నాయక్, ముక్తాల రమేష్, అనుష కృష్ణ,శారదా హరి కిషన్, శారద చెన్నయ్య,మమత మరియు పలువురు ప్రజాప్రతినిధులు మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మట్ట భరత్ గౌడ్, ముఖ్య అతిథులుగా పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా గ్రామాల వినాయక భక్త బృందాల ఆధ్వర్యంలో పూజారులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి,భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.భక్తుల కోలాహలం, భజనల నడుమ వెల్దండ మండలం భక్తిమయంగా మారింది.1012697270.jpg

You may also like...