రేవంత్ రెడ్డి ఖాతాలో మరో కాంగ్రెస్ ఇన్చార్జ్ బలి?
- ఇందిరమ్మ టవర్స్‌లో దళారుల దందాకు చెక్.. - September 14, 2026
- మెట్రో రెండో దశకు కేంద్రం కొర్రీలు.. - September 14, 2026
- రేవంత్ రెడ్డి ఖాతాలో మరో కాంగ్రెస్ ఇన్చార్జ్ బలి? - September 14, 2026
తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్‌ను మార్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉన్నత చదువుల కోసం ఆమె 10 నెలల పాటు విదేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో దీపాదాస్ మున్షీపై ఆరోపణలు చేయించి ఆమెను ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించేలా రేవంత్ రెడ్డి వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఆయన ఏకపక్ష ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు గత ఏడాది ఫిబ్రవరిలో మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ ఇన్చార్జ్గా ఏఐసీసీ నియమించిందనే వాదనలు ఉన్నాయి.అయితే, తనపై, తన సోదరులపై వస్తున్న ఆరోపణలను మీనాక్షి నటరాజన్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందన్న కారణంతోనే ఆమెను మార్చేందుకు కుట్ర జరుగుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొండా సురేఖ బర్తరఫ్ అంశంపై విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆమెను నేరుగా తొలగించకుండా ఉన్నత చదువుల కారణాన్ని చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మీనాక్షి నటరాజన్ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్గా ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్ సింగ్, శక్తిసింహ్ గోహిల్, అశోక్ గెహ్లాట్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఇన్చార్జ్ మార్పుపై ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
