తర్నికల్ తండాలో ఉప్పల ట్రస్టు ఉదారత గాయపడిన యువకుడికి రూ.25 వేల ఆర్థిక సాయం

కల్వకుర్తి మండలం తర్నికల్ తండా గ్రామానికి చెందిన సిద్ధూ నాయక్ (19) జీపు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలు విరిగి ఇంటికే పరిమితమయ్యాడు.విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఉప్పల వెంకటేష్ ఆదేశాలతో ఆయన పెద్ద కుమారుడు డా. ఉప్పల అఖిల్ గురువారం తండాకు వెళ్లి పరామర్శించారు.ట్రస్ట్ తరఫున తక్షణ సహాయంగా రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా డా. అఖిల్ మాట్లాడుతూ సిద్ధూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని,పూర్తిగా కోలుకునే వరకు ట్రస్ట్ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సొమ్లా నాయక్, గుండ్యా నాయక్, శ్రీనివాస్ నాయక్, గణేష్, రుక్మొద్దిన్, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...