రాంచంద్రాపురంలో చాకలి ఐలమ్మ వర్ధంతి

Donthi Mahesh Goud

సంగారెడ్డి, సెప్టెంబర్ 10: వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని గురువారం సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండల కేంద్రములోని సండే మార్కేట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా పలువురు ఆమె విగ్రహానికి పూలమాలలు, పూలు సమర్పించి, కొబ్బరి కాయలు కొట్టి నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా ఆమె పెత్తందారి విధానానికి, దోపిడికి,దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా, దొర దొరసాని సంస్కృతికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరు చేసిన వీర మహిళ చాకలి ఐలమ్మ అని ఆమె త్యాగనిరతిని గుర్తు చేసుకున్నారు. భూమి కోసం,భుక్తి కోసం,శ్రామిక వర్గ విముక్తి కోసం ఆమె సల్పిన పోరాట పటిమలు, అనంతరం జరిగిన పలు ప్రజా పోరాటాలకు నాందిగా నిలిచాయన్నారు. అన్ని రకాల దోపిడీలు వివక్షతలు అంతమయ్యేవరకూ ఆమె ఆశయ సాధనలో అందరూ నడుము బిగించాలని అభిప్రాయ పడ్డారు. అమరత్వం పొందిన వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లపించారు. ఆమె విగ్రహాన్ని సండే మార్కెట్ వద్ద స్థాపించి అందరికి దివగంత వీరనారి చాకలి ఐలమ్మకు గురువారం నివాళులు అర్పించడానికీ అవకాశం కల్పించిన తాజా మాజీ కార్ఫోరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్ కు పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ,తాజా మాజి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి, రాంచంద్రాపురం వాసులు నర్సింహా,సుధాకర్ ప్రభు,సాయికిరణ్,క్రిష్ణ,ఎల్లయ్య,శ్రీను,రవి ,భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

You may also like...