భూములు కోల్పోతున్న రైతులకు రూ.20 లక్షలు ఇవ్వాలి

వెల్దండ సెప్టెంబర్ 10: డిండి – నార్లాపూర్ డి-82 ప్రాజెక్టులో భాగంగా ఇర్విన్ – అజిలాపూర్ రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న బాధితులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.అజిలాపూర్ సర్పంచ్ సిద్దగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసిన రైతులు,నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎకరాకు 20 లక్షలు ఇచ్చిన విధంగా తమకు కూడా పరిహారం ఇవ్వాలని కోరారు.భూములే నమ్ముకుని జీవిస్తున్న తమకు ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గునిగంటి మహేష్, గుడిసె వెంకటయ్య, నెల్లపల్లి వెంకటయ్య, సల్వాది ప్రవీణ్, సల్వాది సురేష్, గునిగంటి గణేష్, గునిగంటి తిరుపతయ్య, తోకల యాదయ్య, తోకల నర్సింహా, చాట్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...