క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026
- టీచర్ల బోధనపై వర్మ తిరుగుబాటు స్వరం - September 5, 2026

గుబ్బడి పత్తెపురం గ్రామంలోని శతాబ్దాల నాటి శ్రీ క్రిష్ణగిరి పాదాల గుట్ట వద్ద శ్రీ రాధాక్రిష్ణ ఆలయ క్షేత్రంలో శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరేష్ కుమార్ సేవా ఫౌండేషన్ కృషితో ఆధ్యాత్మిక క్షేత్రం నూతన కళను సంతరించుకుంది. భక్తులు, గ్రామస్తులు, సమతా పాఠశాల విద్యార్థులు, అధ్యాపక బృందం, సేవా ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సమతా పాఠశాల కరెస్పాండెంట్ దావల్ రెడ్డి సౌజన్యంతో విద్యార్థులు క్రిష్ణుడు, గోపికల వేషధారణలో చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నృత్యకారిణి ప్రతీ నాట్య ప్రదర్శన, టీచర్ రజిని ప్రియ ఆధ్వర్యంలో విద్యార్థుల భగవద్గీత, సనాతన ధర్మం, క్రిష్ణుని జీవిత విశేషాల ప్రసంగాలు అలరించాయి. కళ్యాణ్ పంతులు, నరేష్ కుమార్ ఆధ్యాత్మిక, దేశభక్తి, దైవభక్తి ప్రసంగాలతో చైతన్యం నింపారు.
అనంతరం క్రిష్ణుని తొట్టెలలో వేసి ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్.రామ లక్ష్మయ్య, భూపతి రెడ్డి, ముదిరాజ్ జంగయ్య, ఆర్.రాజు, రావుల పల్లి జంగయ్య, శ్రీశైలం గౌడ్, ఎక్స్ సర్పంచ్ రాంచంద్రయ్య, వెంకటేష్ గౌడ్, రాములు గౌడ్, హరిక్రిష్ణ, ప్రశాంత్ చరణ్, శ్రీనివాస్, దాతలు నాగమణి, కళావతి, అంతగోని నర్సింహాగౌడ్, అనంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అంతప్ప గూడ, గంగ్యాడ, ఎల్లకొండ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది.
ప్రస్తుతం మరకత శివలింగ నామకరణ భక్తుడు, భాజాపా ఎండోన్మెంట్ ధార్మిక సెల్ రంగారెడ్డి జిల్లా రూరల్ జాయింట్ కన్వీనర్, శంకర్ పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్.నరేష్ కుమార్, దాతలు, గ్రామ పెద్దల సహకారంతో క్షేత్రంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

