బాన్సువాడ బాయ్స్ పాఠశాలలో విద్యార్థినులకు యూనిఫాం పంపిణీ

బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జెడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ సి.యు.పి.ఎస్ పాఠశాలలో ఈరోజు విద్యార్థినులకు స్కూల్ యూనిఫాం, హెచ్.పి.వి క్యాన్సర్ నివారణ టీకాలు ఇచ్చే కార్యక్రమం ఘనంగా జరిగింది.ప్రధానోపాధ్యాయురాలు రాణి మేడం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, కౌన్సిలర్లు మహ్మద్ ఖాలిక్, నార్ల నందకిశోర్, కో ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, కమర్ సుల్తానా, గౌస్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మన్సూర్ హాజరయ్యారు.విద్యార్థినులకు యూనిఫాంలు అందజేసి, వైద్య సిబ్బంది ద్వారా హెచ్.పి.వి టీకాలు వేయించారు. కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నార

You may also like...