మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
- రిఫరల్ హాస్పిటల్గా నిజామాబాద్ జీజీహెచ్ - August 3, 2026
- మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు - August 3, 2026
- సమన్వయంతోనే ప్రభుత్వ పథకాల సమర్థ అమలు: ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు - August 3, 2026

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం:రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 03:
వెల్దండ మండలం రాఘయిపల్లి గ్రామానికి చెందిన కోనేటి లక్ష్మమ్మ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో వెల్దండ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ ఎంపీపీ పుట్టరామ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,మాజీ ఎంపిటిసి నిరంజన్,ఉప సర్పంచ్ కొండల్ యాదవ్,వెంకటయ్య,మెండే శ్రీను,అంజి మాస్టర్,గణేష్,అశోక్, పాపా,గిరి,మలేష్, సుదర్శన్, సురేష్,నర్సింహా,తదితరులు పాల్గొన్నారు.
