నూతన ఎస్సైని సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులు

నూతన ఎస్సైని సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులు


జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 03
ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నూతనంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్సై సంతోష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు వస్పుల సురేష్ మరియు సంఘ సభ్యులు శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థులు మరియు యువకులు గంజాయి డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అందరూ హెల్మెట్ ధరించాలని తెలిపారు. అంబేద్కర్ యువజన సంఘం మంచి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులలో యువకులలో చైతన్యం తీసుకురావాలని ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మీసాల రమేష్, జాయింట్ సెక్రెటరీ ఎండి అప్సర్, కల్చలర్ ఆక్టివిటీ అధ్యక్షులు వస్పుల ప్రభుశంకర్, సోషల్ మీడియా ఇంచార్జ్ లండం శివ, తదితరులు ఉన్నారు.

You may also like...