బీసీల ఆత్మగౌరవ భవనాలకు నిధులు మంజూరు

బీసీ కుల సంఘాల అభివృద్ధి, సామాజిక ఆత్మగౌరవానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మొత్తం 37 బీసీ కుల సంఘాలకు సంబంధించి నిధుల మంజూరు ఉత్తర్వుల జీవో పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ నిర్ణయంతో ఆయా కుల సంఘాల ప్రతినిధుల్లో హర్షం వ్యక్తమవుతోంది. బీసీ కులాల ఐక్యత, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఆత్మగౌరవ భవనాలు ఎంతో దోహదపడనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీసీ సంఘాల ఆకాంక్షకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఊతమివ్వనుంది. బీసీల సంక్షేమం, అభ్యున్నతికి మరిన్ని చర్యలు చేపట్టాలని సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

You may also like...