Author: MALLEPAKULA JANGAIAH

తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా నీలకంఠ పాండు

తలకొండపల్లి మండల బీజేపీ అధ్యక్షుడిగా నీలకంఠ పాండు నియమితులయ్యారు. జాతీయ నేత తల్లోజు ఆచారి ఆశీర్వాదం తీసుకుని బాధ్యతలు స్వీకరించారు. తనకు అవకాశం ఇచ్చిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, మండలంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు

అచ్చంపేటలో గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి తొలి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అన్నారు. క్యాంప్ ఆఫీస్ లో లబ్ధిదారులతో సమావేశమయ్యారు.2వ విడతలో 2.5 లక్షల ఇళ్లు గుడిసె వాసులకే కేటాయిస్తామని, అర్హుల గుర్తింపు కోసం AI తో సమగ్ర సర్వే చేస్తున్నామని తెలిపారు.

అచ్చంపేటలో కాంగ్రెస్ సమీక్ష సమావేశం

అచ్చంపేట నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, పట్టణ అధ్యక్షులతో డా. వంశీకృష్ణ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..• గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. • ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. • పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. • పార్టీ కోసం…

ఆమనగల్ లో ఘనంగా 70వ SGFI జోనల్ స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం

కల్వకుర్తి / ఆమనగల్: రంగారెడ్డి జిల్లా, ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని బాలుర ఉన్నత పాఠశాల (Z.P.H.S) లో 70వ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జోనల్ స్థాయి అండర్-14, అండర్-17 వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమనగల్ మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి తల్లోజు గీతా ఆచారి గారు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా గీతా ఆచారి గారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు,…

జూరాలకు కృష్ణా జలాలు – రైతులకు ఊరట

జూరాలకు కృష్ణా జలాలు – రైతులకు ఊరట

కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాల ప్రాజెక్టుకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేసేందుకు అంగీకరించిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం డీకే శివకుమార్ గారికి తెలంగాణ కాంగ్రెస్, పాలమూరు రైతుల తరపున ధన్యవాదాలు – కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి.సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కర్ణాటక ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, జూరాలకు నీరు రావడంతో పాలమూరు ఆయకట్టు రైతులకు సాగు భరోసా…

తాడూర్ లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ

నాగర్ కర్నూల్: తాడూర్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు,…

బల్మూర్ లో రైతులకు వేరుశెనగ విత్తనాల పంపిణీ

బల్మూర్ మండలం కొండనాగుల గ్రామ పంచాయతీ పరిధిలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే తన లక్ష్యమని, వ్యవసాయ అభివృద్ధే తన ధ్యేయమని అన్నారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకొని పంట దిగుబడి పెంచుకోవాలని సూచించారు. రైతుల అభ్యున్నతికి, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కల్వకుర్తి సీతారామాంజనేయ ఆలయంలో లడ్డూ వేలం – రూ.3.16 లక్షలు పలికిన గణేష్ లడ్డూ

కల్వకుర్తి పట్టణంలోని శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయంలో బుధవారం వినాయక లడ్డూ వేలం పాట నిర్వహించారు.నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టిన లడ్డూను వేలం వేయగా, స్థానికుడైన బ్రృంగి శ్యాంమోహన్ రూ.3.16 లక్షలకు దక్కించుకున్నారు.అనంతరం వినాయక విగ్రహ దాతలు దుర్గాప్రసాద్, శివకుమార్ లను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పసుల లలిత, రాచోటి శ్రీశైలం, వెంకట్ రెడ్డి, బాలసాయి, రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేదలకు CMRF ఒక వరం లాంటిది: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లా:పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరం లాంటిదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందిస్తూ, వారికి అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు.నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే బుధవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అనారోగ్యంతో బాధపడుతున్న పేద…

సత్యశోధక్ సమాజ్ దినోత్సవ శుభాకాంక్షలు

సత్యశోధక్ సమాజ్ దినోత్సవ శుభాకాంక్షలు

రాష్టపిత జోతిబా ఫూలే 1873 సెప్టెంబర్ 24 న సత్యశోధక్ సమాజ్ ను స్థాపించారు. ఇది ఎంత శక్తివంతమైనది అంటే. ఈ సామాజిక వ్యవస్థపై పూర్తి ఆధిపత్యం కలిగి ఉన్న బ్రాహ్మణ భావజాలం ఉలిక్కిపడి లేచి ఆర్యసమాజ్ స్థాపించ వలసి వచ్చినంత.అప్పటికి శూద్రులు గా "ఇప్పుడు OBC,SC,ST లు గా సుమారు 6,743 కులాలుగా ఉన్నారు. సత్యశోధక్ సమాజ్ లక్ష్యం ఈ వ్యవస్థ లో బ్రాహ్మణ భావజాలం తెచ్చిన కుల విభజన, మరియు బ్రాహ్మణ భావజాలం మనపై…