హామీల కోసం ఉద్యమకారుల పోరు.. బాన్సువాడలో అరెస్ట్లు
- హామీల కోసం ఉద్యమకారుల పోరు.. బాన్సువాడలో అరెస్ట్లు - October 26, 2026
- వజ్జేపల్లిలో విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు - October 25, 2026
- బీర్కూర్ సొసైటీ చైర్మన్గా గొండ్ల శ్రీనివాస్ - October 25, 2026
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్న బాన్సువాడ ప్రాంత ఉద్యమకారులను సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 6 గంటలకే తమను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 250 గజాల స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్, గుర్తింపు కార్డులు అందించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉడుత గంగాధర్, గంజి చందు, భాస్కర్ గౌడ్, కల్వ శ్యామ్, ఎదుబల్లి కృష్ణ, అగ్లవే దత్తు, గంగారాం, పల్లికొండ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
