ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఆరుతడి పంటలే మేలు!

ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున యాసంగిలో రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని బాన్సువాడ ఆర్డీఓ అడ్లా రవీందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్‌, మంజీరా జలాలు, చెరువుల నీటిపై ఆధారపడే రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండాలన్నారు.
జొన్న, శనగ, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ అధికారులు సూచించారు. చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లో అనధికారికంగా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని వినియోగిస్తే విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తామని అధికారులు హెచ్చరించారు. నీటిని పొదుపుగా వినియోగించి, ప్రత్యామ్నాయ పంటలతో నష్టాలను నివారించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ, విద్యుత్‌, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.

You may also like...