వెల్దండలో బాధితురాలిని పరామర్శించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
- వెల్దండలో బాధితురాలిని పరామర్శించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి - October 19, 2026
- లింగారెడ్డిపల్లిలో ఘనంగా LPL-5వ సీజన్ ప్రారంభం - October 18, 2026
- నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో రెవెన్యూ రీ-సర్వే పనుల పరిశీలన - October 9, 2026
వెల్దండ : వెల్దండ మండల కేంద్రానికి చెందిన నాగిళ్ల భారతమ్మ ఇటీవల గుండెపోటుకు గురై హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు బుధవారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అనంతరం తక్షణ సహాయంగా రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో వెల్దండ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, జిల్లా నాయకులు నాగులు నాయక్, చెర్కూర్ సర్పంచ్ శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ లింగం, మాజీ సర్పంచ్ అంజి నాయక్, మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, వార్డు సభ్యులు జంగిలి సునీత, ఆనంద్, శేఖర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొమ్ము నాగయ్య, సీనియర్ నాయకులు అంజి మాస్టర్, అశోక్ కుమార్, ప్రవీణ్, రాజు, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
