కౌన్సిలర్‌కు అండగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
- కౌన్సిలర్‌కు అండగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి - October 19, 2026
- దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. బీజేపీ నూతన బాధ్యులకు సన్మానం - October 19, 2026
- కల్వకుర్తి వాసవి దేవాలయానికి ఉప్పల వెంకటేష్ రాక - October 19, 2026

కల్వకుర్తి: కల్వకుర్తి పురపాలక సంఘం కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మబ్బు రామరాజు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను స్వయంగా నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించారు. వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు.అనంతరం రామరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యేన్నం భూపతి రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
