జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎస్. జగదీశ్వర్‌కు మిత్రబృందం ఘన సన్మానం
- భక్తిశ్రద్ధలతో గణపతి పూజలో సీఎం రేవంత్‌రెడ్డి - September 14, 2026
- జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎస్. జగదీశ్వర్‌కు మిత్రబృందం ఘన సన్మానం - September 14, 2026
- ఆర్ఆర్ఆర్కు కేంద్రం బ్రేక్! - September 14, 2026

శంకర్‌పల్లి : విద్యారంగంలో విశిష్ట సేవలు అందించి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు ఎస్. జగదీశ్వర్‌కు ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శంకర్పల్లిలోని వైభవం బ్యాంకెట్ హాల్ లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అవార్డు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన మిత్రులు, ఉపాధ్యాయ వృత్తిలో జగదీశ్వర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు మెమోరాండం అందజేసి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఆయన చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణ, సేవా తపన ఆదర్శప్రాయమని పలువురు అభిప్రాయపడ్డారు. విద్యను కేవలం బోధనకే పరిమితం చేయకుండా విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు పెంపొందించేందుకు జగదీశ్వర్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఆయనకు లభించిన ఈ గౌరవం ప్రాంతానికే గర్వకారణమని కొనియాడారు.
అవార్డు గ్రహీత ఎస్. జగదీశ్వర్ మాట్లాడుతూ, తనకు లభించిన ఈ గుర్తింపు విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు మరియు మిత్రుల ప్రోత్సాహం వల్లే సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీపీ శివ ప్రసాద్, ఈర్లపల్లి సర్పంచ్ ముత్తంగి లావణ్య రాజశేఖర్, మాశెట్టి నరేష్, బీర్ల రాజు, సురేష్, రమేష్, సందీప్, పార్సి అమర్, పెద్ది వీరేష్, కుమార్, ఆత్మలింగం, అంతయ్య, చంద్రకాంత్ రెడ్డి, సాయికుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్, రవీందర్, సతీష్, ప్రభాకర్ తదితరులు పాల్గొని జగదీశ్వర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

