కరెంటు కోతలతో రైతన్న ఆగ్రహం – తాండ్ర గేట్ హైవే బ్లాక్.!

కల్వకుర్తి 10: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో కరెంటు కోతలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను గాలికి వదిలేసిందని ఆరోపించారు.రోజురోజుకు కరెంటు కోతలు విధిస్తూ రైతులను వేధిస్తున్నారని, కరువుతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ ఎట్టి ఆంజనేయులు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బొట్టె మల్లయ్య రైతులకు మద్దతు తెలిపారు.విషయం తెలుసుకుని వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్సైలు కురుమూర్తి, రాజశేఖర్, మాధవరెడ్డి మరియు సిబ్బంది రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. రైతులు గోవర్ధన్ రెడ్డి, ఎగిరిశెట్టి హనుమంతు, రవి, శ్రీను, నిరంజన్, ముద్రకోళ్ళ మైబు, మల్లేష్, అల్లాజి తదితరులు పాల్గొన్నారు.

You may also like...