శంకర్‌పల్లిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు
- శంకర్‌పల్లి సాయి కాలనీ యువ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఆగమన్ - September 10, 2026
- శంకర్‌పల్లిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు - September 10, 2026
- రంగారెడ్డి కబడ్డీ జట్ల ఎంపిక - September 10, 2026

- వీర వనిత స్ఫూర్తి చిరస్మరణీయం: ఎమ్మెల్యే కాలే యాదయ్య
శంకర్‌పల్లి: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శంకర్‌పల్లి పట్టణంలో ఆమె విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గోపాలరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్వేత పాండురంగారెడ్డి, మండల మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటరెడ్డి, చంద్రమౌళి, మార్కెట్ వైస్ చైర్మన్ చంద్రమోహన్, మోకీల సర్పంచ్ శేకర్, కౌన్సిలర్లు ఆనంద్, సంధ్య రాణి అశోక్, గిరిజ శేకర్, లలిత మోహన్ రెడ్డి, ఉషాకిరణ్ విజయ్, ప్రశాంత్, అఖిల యాదిరెడ్డి, గణేష్, ఫైముదా బేగం సమ్మి, అశోక్, కో ఆప్షన్ సభ్యులు బాలకృష్ణ రెడ్డి, రజని శ్రీనివాస్, మహమూద్, మొయిన్, మాజీ సర్పంచ్ ప్రకాష్ గుప్తా, మాజీ వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు ప్రశాంత్, సర్తాజ్, నాయకులు పొడువు శ్రీనివాస్, గోపాల్, సత్యం, బాలకృష్ణ, రాంరెడ్డి, అనంత్ రెడ్డి, రజక సంఘం నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.
