మృతుల కుటుంబాలకు గోలి ఆర్థిక సహాయం అందజేత

వెల్దండ, అక్టోబర్ 9: వెల్దండ మండలంలోని పోతేపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాలకు అంజి మాస్టర్ అండగా నిలిచారు.తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మృతుల కుటుంబాలకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.పోతేపల్లి గ్రామానికి చెందిన డెంకి చంద్రమౌళి, లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లెపాకుల ప్రశాంత్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న అంజి మాస్టర్,…

బాన్సువాడ ఆర్టీసీ డిపోలో యూనియన్ ఎన్నికల సందడి

బాన్సువాడ: బాన్సువాడ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగ సంఘాల ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. వివిధ కార్మిక సంఘాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.ఎంప్లాయిస్ యూనియన్, టీఎస్‌డబ్ల్యూయూ, ఐఎన్‌టీయూసీ, ఎస్‌డబ్ల్యూఎఫ్, బీఎంఎస్, టీఎంయూ తదితర యూనియన్లు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఉదయం నుంచే డిపోలో ఎన్నికల సందడి నెలకొనగా, ఉద్యోగులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి ఓట్లు వేస్తున్నారు.పోలింగ్ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం…

బతుకమ్మలతో పాఠశాలల విద్యార్థినులు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండగ బతుకమ్మ .పువ్వులను ఆరాధించడం ఒక విలక్షణ సంస్కృతిగా మన తెలంగాణలో కనిపిస్తుంది మహిళల ఆత్మీయ, ప్రకృతి ప్రేమ, భక్తి, సాంస్కృతిక వైవిధ్యాన్ని బతుకమ్మ చాటుతుంది.పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చే  తరుణంలో విద్యార్థినులు  ఉదయం పాఠశాలకు వెళ్లే సమయంలో అక్కడక్కడ బస్ స్టాప్ లలో, పాఠశాలలకు వెళ్లే దారులలో  బతుకమ్మలతో సంప్రదాయ దుస్తులలో చిన్నారులు రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో  కనిపించారు పాఠశాలలకు చివరి రోజు కావడంవల్ల బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు ….

బ్యాతల శివశంకర్ పార్థివదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

రంగారెడ్డి జిల్లా పరిధిలోని టంగుటూరు గ్రామానికి చెందిన యువకుడు బ్యాతల శివశంకర్ గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.యువకుడు శివశంకర్ మరణవార్త తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ...

గుండెపోటుతో MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మృతి

శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందినMRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ ఈరోజు ఉదయం 5 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బ్యాతల శివశంకర్ మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన...

కట్టంగూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల నిరసన

కట్టంగూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల నిరసనజ్ఞాన తెలంగాణ కట్టంగూర్, అక్టోబర్ 8: ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన శాంతియుత ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులను పోలీసులు అరెస్టు చేసి, లాఠీచార్జ్‌ చేయడాన్ని నిరసిస్తూ కట్టంగూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు సుంకరబోయిన వెంకన్న మాట్లాడుతూ నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా…

స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి : కట్టంగూర్ సర్పంచ్‌ ముక్కామల శ్యామల శేఖర్

స్మార్ట్‌ రేషన్‌ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి : కట్టంగూర్ సర్పంచ్‌ ముక్కామల శ్యామల శేఖర్ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్‌ 8 : ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూరు సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను గురువారం ఆర్ఐ రామారావు తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు…

పిల్లల అవసరాన్ని గుర్తించి.. స్పీకర్ బహూకరణ నారగూడెం ప్రభుత్వ పాఠశాలకు సర్పంచ్ మల్లేశ్ చేయూత

పిల్లల అవసరాన్ని గుర్తించి.. స్పీకర్ బహూకరణనారగూడెం ప్రభుత్వ పాఠశాలకు సర్పంచ్ మల్లేశ్ చేయూతజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 8 : పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించే ప్రార్థన, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు సౌకర్యవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌత్ స్పీకర్‌ను గురువారం నారగూడెం సర్పంచ్ కురిమిల్ల మల్లేశ్ అందించారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్పీకర్ అవసరాన్ని గుర్తించిన ఆయన సొంతంగా స్పీకర్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు…

SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో IMAX లైట్ ఏర్పాటు…

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం గురువారం రోజు జనగామ మర్రి మాందాపూర్ చౌరస్తా వద్ద మాందాపూర్ మరియు జనగామ వెళ్లే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి దృష్టిలో ఉంచుకొని SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో IMAX లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జనగామ సర్పంచ్ మట్ట శ శ్రీనివాస్ మరియు మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి మాందాపూర్ సర్పంచ్ హరీష్ యాదవ్ సీతారాం పల్లి సర్పంచ్ సిద్ధ రాములు ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు జీవన్ రెడ్డి…