ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు, 24,25 తేదీల్లో అవకాశం
బాన్సువాడ :బాన్సువాడలోని ఎస్సార్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందూరి గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఇప్పటివరకు డిగ్రీలో ప్రవేశం పొందని విద్యార్థులకు ఈ స్పాట్ అడ్మిషన్లు మంచి అవకాశమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత తేదీల్లో కళాశాలకు హాజరై, అవసరమైన…
