Author: Kethavath Permal

,తిమ్మాపూర్ తిరుమలలో ప్రత్యేక పూజలు.. పోచారం, అకాడమిక్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దర్శనం

బాన్సువాడ, సెప్టెంబర్ 30: తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పోచారం వివరించారు. తిమ్మాపూర్ ఆలయాన్ని “తెలంగాణ తిరుపతి”గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను తెలిపారు. అనంతరం…

సేవా సంకల్పంతో.. అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం

బాన్సువాడ మండలం తిరుమలాపూర్ గ్రామంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్లను సన్మానించి, వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.అంగన్‌వాడీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను వివరించారు. అనంతరం అంగన్‌వాడీ చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, అంగన్‌వాడీ…

ప్రజల నమ్మకమే జర్నలిస్టులకు రక్షణ – ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

ప్రజల విశ్వాసాన్ని పొందినప్పుడే జర్నలిస్టులకు నిజమైన రక్షణ, గౌరవం లభిస్తుందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో కామారెడ్డి జిల్లా విలేకరులకు నిర్వహించిన పునశ్చరణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. కాలానుగుణంగా మీడియా రంగం అనేక మార్పులకు లోనవుతున్నప్పటికీ ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం వృత్తి కత్తిమీద సాములాంటిదని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాస్తవాలను…

ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ గళం.. కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి

ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆందోళనకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్ నాయకత్వం వహించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ…

శాంతియుతంగా వినాయక నిమజ్జనం.. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజుల పాటు నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా విజయవంతంగా ముగిసిందని మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు, కాంగ్రెస్ యువ నాయకుడు కాసుల రోహిత్ తెలిపారు. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండపాల నిర్వాహకులు, యువత, మహిళలు, భక్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, మీడియా ప్రతినిధులు అందించిన సహకారం అభినందనీయమన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జనం ప్రశాంతంగా ముగియడం అందరి…

తల్లీబిడ్డల ఆరోగ్యమే లక్ష్యం.. పోషకాహారమే శ్రీరామరక్ష!

బాన్సువాడ మండలంలోని సొమ్లా నాయక్ తండాలో సర్పంచ్ మీరిబాయి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్ రాథోడ్ స్వరూప నేతృత్వంలో శనివారం పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహిస్తున్న పోషణ్ మాహ్‌లో భాగంగా గర్భిణీలు, బాలింతలకు పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ రాథోడ్ స్వరూప మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ప్రతిరోజూ సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డలు…

బాన్సువాడలో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ బందోబస్తు

బాన్సువాడ, సెప్టెంబర్ 25: గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు బాన్సువాడలో పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు, 100 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. నిమజ్జన శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భక్తులు, ప్రజలు పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ…

ఆర్ టి ఐ జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి కోనాపూర్ వడ్ల శివరాం శ్రీను ఎంపిక

బాన్సువాడ: సమాచార హక్కు చట్టం-2005 అమలు కోసం కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినా జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త పడ్ల శివరాం శ్రీను పేరును బాన్సువాడ ఆర్డీవో సిఫార్సు చేశారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో రవీందర్ రెడ్డి లేఖ నం. F/2093/2026 ద్వారా కలెక్టర్ కు ప్రతిపాదన పంపారు. 4 ఏళ్లుగా ఆర్టీఐ రంగంలో అనుభవం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం బాన్సువాడ…

శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు స్థల పరిశీలన

బీర్కూర్: గ్రామపంచాయతీ పరిధిలోని కమాన్ వద్ద శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సెలైన్ చేతికే… సేవ మాత్రం ఆగలేదు!

బాన్సువాడ :తాను పేషెంట్‌గా మారినా.. రోగుల సేవలోనే డాక్టర్ శ్రీను నాయక్వృత్తి ధర్మానికి అంకితభావం.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం,వైద్యుడిని దైవంతో సమానంగా ఎందుకు చూస్తారో నిరూపించే మానవీయ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన విధులకు సెలవు పెట్టకుండా, ఒక చేతికి సెలైన్ ఎక్కించుకుంటూనే మరోవైపు రోగులకు వైద్య సేవలు అందించిన డాక్టర్ శ్రీను నాయక్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి…