బీర్కూర్ సొసైటీ చైర్మన్‌గా గొండ్ల శ్రీనివాస్

బీర్కూర్ సహకార సంఘం చైర్మన్‌గా బరంగేడ్గి గ్రామానికి చెందిన గొండ్ల శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ పదవి కోసం అంబలి బసవరాజ్, గొండ్ల శ్రీనివాస్ పోటీపడగా, చివరకు శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. త్వరలో సొసైటీ పాలకమండలి డైరెక్టర్లను ఎంపిక చేయనున్నారు.

You may also like...