పోచారం ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.3 కోట్ల నిధులు మంజూరు…

కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్ట్ అభివృద్ధి నమూనాలపై ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు వివరించిన ఆర్కిటెక్చర్ నిపుణులు, కన్సల్టెంట్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు.. త్వరలో పనులు ప్రారంభం నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్‌ను ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ప్రత్యేక కృషితో రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో పోచారం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను రూపొందించారు. ఈ అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని కలిసిన ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆర్కిటెక్చర్ నిపుణులు మరియు కన్సల్టెంట్లు పోచారం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూపొందించిన నమూనాలను, ప్రతిపాదిత ప్రణాళికలను వివరించారు. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేయడంతో పాటు, ప్రకృతి సౌందర్యాన్ని పరిరక్షిస్తూ అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రూపొందించిన డిజైన్లు, అభివృద్ధి ప్రతిపాదనలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, పోచారం ప్రాజెక్ట్‌ను ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఇందుకోసం ప్రత్యేక చొరవ తీసుకొని రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యేలా కృషి చేసినట్లు తెలిపారు. పర్యాటక అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రకృతి అందాలను కాపాడుకుంటూ, సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా పోచారం ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆర్కిటెక్చర్ నిపుణులు, కన్సల్టెంట్ల సమన్వయంతో ప్రతిపాదిత ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లి, త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...