జనగామ జిల్లాలో ఘనంగా స్వేరో డే వేడుకలు.
- జనగామ జిల్లాలో ఘనంగా స్వేరో డే వేడుకలు. - October 22, 2026
- హమారా ప్రసాద్‌పై జనగామలో నిరసన.. దిష్టిబొమ్మ దహనం. - September 19, 2026
- జిల్లా గ్రంథాలయంలో పారిశుద్ధ్య లోపాలు పిచ్చి మొక్కలు, దోమలతో విద్యార్థుల ఇబ్బందులు. - September 14, 2026
జనగామలో ఘనంగా స్వేరో డే వేడుకలు
ప్రెస్టన్ జూనియర్ కళాశాల ఆవరణలో స్వేరో జెండా ఆవిష్కరణ
జనగామ, అక్టోబర్ 22: స్వేరో డే, ఎస్.ఆర్. శంకరన్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 22న జనగామ జిల్లా స్వేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో స్వేరో ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. జనగామ జిల్లాలోని ప్రెస్టన్ జూనియర్ కళాశాల ఆవరణలో స్వేరో జెండాను ఎగురవేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం అనే నాలుగు ప్రధాన అంశాల సాధన లక్ష్యంగా స్వేరో నెట్వర్క్ పనిచేస్తోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి ద్వారా సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం స్వేరో ఉద్యమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ స్వేరోలు తాళ్లపల్లి వెంకటస్వామి, రజనీకాంత్, జనగామ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్యాట రాజు, మాజీ ఉపాధ్యక్షుడు సందీప్, మాజీ అధికార ప్రతినిధి వంగాల కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి శాగ అరుణ్ , మాజీ సహాయ సలహాదారు క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
అలాగే స్వేరోస్ ఇంటర్నేషనల్ ప్రస్తుత కమిటీ ఇన్చార్జి, మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు గాదె రజితతో పాటు పలువురు స్వేరో నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
