వైవీ ప్రసాద్ కుటుంబానికి ఏనుగు రవీందర్‌రెడ్డి పరామర్శ

సీనియర్ జర్నలిస్ట్ వైవీ ప్రసాద్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిజం రంగానికి ప్రసాద్ మృతి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాసాని శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి గణేష్, కొత్తకొండ భాస్కర్, కిషోర్ యాదవ్, నందు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...