వెల్దండలో వైభవోపేతంగా విజయదశమి వేడుకలు

1001284929.jpg

వెల్దండ, అక్టోబర్ 21:విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి వేడుకలను వెల్దండ మండల కేంద్రంతో పాటు గ్రామాలు,తండాల్లో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, మహిళలు బతుకమ్మ ఆడి చెరువుల్లో నిమజ్జనం చేశారు.ప్రజలు నూతన వస్త్రాలు ధరించి,డప్పుచప్పుళ్ల నడుమ గ్రామ పంచాయతీ నుంచి బీరప్పగడ్డ సమీపంలోని జమ్మిచెట్టు వద్దకు చేరుకున్నారు.సర్పంచ్ మట్ట యాదమ్మ, మట్ట వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో పురోహితుడు భాస్కర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జమ్మిచెట్టును దర్శించుకుని, ఒకరికొకరు అలాయ్‌ బలాయ్‌ ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పెద్దల ఆశీర్వాదాలు పొందారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, ఉపసర్పంచ్ ఎర్ర శ్రీను, మాజీ ఎంపీటీసీ చిందం కృష్ణయ్య, మాజీ ఉపసర్పంచ్ నిరంజన్, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి,నక్కర కంటి శ్రీనివాసులు,వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు,మహిళలు, యువకులు పాల్గొన్నారు.

You may also like...