లింగంపల్లి తండాలో సంప్రదాయబద్ధంగా విజయదశమి వేడుకలు
- ఘనంగా శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ జన్మదిన వేడుకలు - October 22, 2026
- వెంకటపూర్ నుండి అమ్మవారి దర్శనానికి పాదయాత్ర - October 22, 2026
- భక్తి శ్రద్ధలతో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు - October 22, 2026

బాన్సువాడ :విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నసురుల్లాబాద్ మండలం లింగంపల్లి తండాలో తండావాసులు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి ఇంటా అమ్మవారిని ప్రత్యేకంగా పూజించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.విజయదశమి సందర్భంగా తండాలోని ప్రతి గడపలోనూ పండుగ శోభ సంతరించుకుంది. కుటుంబ సభ్యులంతా కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయంలో భాగంగా మేకలను బలి ఇచ్చి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులతో పంచుకున్నారు.తండా ప్రజలంతా ఐకమత్యంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ పెద్దలు, యువకులు, నాయక్, కారోబారి, సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ కార్యదర్శితో పాటు పలువురు గ్రామ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు ప్రతీకగా విజయదశమి వేడుకలు లింగంపల్లి తండాలో విజయదశమి వేడుకలు కేవలం పండుగగానే కాకుండా, తండా ప్రజల ఆచారాలు, సంప్రదాయాలు, ఐకమత్యానికి ప్రతీకగా నిలిచాయి. ప్రతి ఇంటా అమ్మవారిని కొలుస్తూ భక్తితో మొక్కులు తీర్చుకోవడం తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ అని తండావాసులు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
