క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం..సుంకిరెడ్డి

1001275325.jpg

తలకొండ పల్లి :తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌కు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు,టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై క్రీడాకారులను అభినందించారు.టోర్నమెంట్ నిర్వహణకు రూ.10 వేల విరాళం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం,నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.అనంతరం తండా ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దేశ్యా నాయక్, మాన్య నాయక్, నిర్వాహకులు రమేష్ నాయక్, శివ, గణేష్, శ్రీను, దేవ్ సింగ్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...