దుర్గా నవరాత్రి ఉత్సవాలకు సర్పంచ్ కొండల్ యాదవ్ చేయూత
- కౌన్సిలర్‌కు అండగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి - October 19, 2026
- దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. బీజేపీ నూతన బాధ్యులకు సన్మానం - October 19, 2026
- కల్వకుర్తి వాసవి దేవాలయానికి ఉప్పల వెంకటేష్ రాక - October 19, 2026
కల్వకుర్తి అక్టోబర్ 17: వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలకు గ్రామ సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘ ప్రధాన కార్యదర్శి తగుళ్ల కొండల్ యాదవ్ రూ.10 వేల విరాళం అందజేశారు. ఉత్సవాల ఏర్పాట్లను నిర్వాహకులను అడిగి తెలుసుకుని, తనవంతు సహకారంగా విరాళాన్ని అందించారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజలందరూ ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు, శ్రీ దుర్గాభవాని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు లట్టు యాదవ్,మల్లేష్ యాదవ్, వంశి యాదవ్,ప్రశాంత్ యాదవ్, శివ యాదవ్,రాకేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
