బాన్సువాడలో 31 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
- బాన్సువాడలో 31 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు - October 19, 2026
- డంపింగ్ యార్డు పొగతో నాలుగు గ్రామాల ప్రజలకు అవస్థలు! - October 19, 2026
- ఎస్సీ రోస్టర్లో మాలలకు అన్యాయం: అయ్యాల సంతోష్ - October 18, 2026

బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డుల నుండి 31 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను ఈరోజు ఉదయం 9 గంటలకు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, నాయకులు మహ్మద్ ఏజాజ్, అబ్దుల్ వాహబ్, నార్ల సురేష్, అసద్ బిన్ మోసిన్, ఖాళీక్, మహ్మద్ గౌస్, నర్సన్న చారి, పురపాలక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు హాజరయ్యారు.
